Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 4:1 - పవిత్ర బైబిల్

1 ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దరు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య–నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవాయందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొనిపోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 4:1
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి, అదీ, నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి కూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.


రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.)


ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు.


యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు.


బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?” “అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.


యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?” ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అని చెప్పాడు.


ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు.


ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారు చేయి” అని చెప్పాడు.


కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”


“మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయమని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము.


అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.


భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.


కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.


యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.


యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.


పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చుకొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.


సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.


ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు.


యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు. అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి? నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బు రుణం ఉన్నానా? అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా? లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలంగానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను. మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.


మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు.


ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును.


దేవుని అనుచరులు ఒకరితో ఒకరు మాట్లాడారు. అది యెహోవా విన్నాడు. ఆయన ఎదుట ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుని అనుచరుల పేర్లు ఉన్నాయి. వారు యెహోవా పేరును గౌరవించేవారు.


“అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు.


కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.


“కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు.


“మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”


“సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు.


దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.


ఓ ప్రభూ! నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ వొక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి. కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”


అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది: “ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి. ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”


ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు.


చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిపి వారు మొత్తం నాలుగు వందలమంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ