2 కొరింథీ 10:12 - పవిత్ర బైబిల్12 ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్ళతో పోల్చుకోము. తెలివిలేనివాళ్ళు తమ గొప్పతనాన్ని తామే కొల్చుకుంటూ, తమతో తమను పోల్చుకొంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరిచూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 తమను తామే పొగడుకునే వారితో జత చేరడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే బేరీజు వేసుకుంటూ తమలో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 తమను తామే పొగడుకునే వారితో జత చేరడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే బేరీజు వేసుకుంటూ తమలో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము12 తమను తామే పొగడుకునే వారితో మమ్మల్ని వర్గీకరించుకోడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే కొలుచుకుంటారో తమతో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థం. အခန်းကိုကြည့်ပါ။ |