1 తిమోతికి 3:7 - పవిత్ర బైబిల్7 సంఘానికి చెందనివాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సాతాను వలలో పడకుండా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా మంచి సాక్ష్యం కలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా మంచి సాక్ష్యం కలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము7 అతడు సంఘస్థులు కాని వారిలో కూడ మంచి పేరు గలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందలు పాలై సాతాను వలలో చిక్కుకోకుండా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။ |
వాళ్ళు, “మేము కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవిత్రమైన దేవదూత అతనితో చెప్పాడు” అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు.