Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 తిమోతికి 2:9 - పవిత్ర బైబిల్

9 స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి, వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం వారికి అలంకారముగా అనుకొనక,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

9 అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 తిమోతికి 2:9
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు. బంగారు, వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి కూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు.


యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది. జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషణములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది.


మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవనమెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. అతను న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు.


యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు!


ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది. సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.


ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు. ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది. భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.


ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది.


యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”


పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు క్రొత్తవాటిలా చేయబడతాయి.


ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.


యూదా, నీవు నాశనం చేయబడ్డావు. నీవేమి చేస్తున్నావు? నీ అందమైన ఎర్రని దుస్తులు ఎందుకు ధరించావు? నిన్ను బంగారు ఆభరణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు? నీ కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు? నీ అలంకరణ వ్యర్థం. నీ ప్రేమికులు నిన్నసహ్యించుకుంటారు. వారు నిన్ను చంపాలని చూస్తున్నారు.


మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు.


దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ