1 సమూయేలు 7:6 - పవిత్ర బైబిల్6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి–యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు. శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు. కష్టాలు ఎదురైనప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు. పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు. నీవు చాలా దయాశీలివి. అందుకని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు. ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.