Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 24:15 - పవిత్ర బైబిల్

15 యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 యెహోవా నీకూ, నాకూ మధ్య న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడుగాక. ఆయనే అసలు విషయం విచారణ జరిపి నా తరపున వాదులాడి నిన్ను కాక నన్ను నిర్దోషిగా తీరుస్తాడు గాక.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 24:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.


యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.


యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము.


దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము. నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు. ఆ ప్రజలు వంకర మనుష్యులు. దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.


ప్రజలారా, మీరంతా వినండి! భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి! నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయంనుండి వస్తాడు. నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.


నేను యెహోవాపట్ల పాపం చేశాను. అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు. కానీ న్యాయస్థానంలో ఆయన నా తరఫున వాదిస్తాడు. నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు. పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు. ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను.


ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు సరియైనది చేస్తున్నారో, అమ్మోనీయులు సరియైనది చేస్తున్నారో అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా నిర్ణయించునుగాక!”


గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు.


యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను.


నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు. అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు. ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు.


పరదేశీయులతో ఉండమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”


దావీదు తన వేగుల వారిని పంపి, సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ