1 సమూయేలు 23:2 - పవిత్ర బైబిల్2 “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాను అడిగాడు. “వెళ్లు. ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధానమిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అంతట దావీదు–నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా–నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు దావీదు “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపమంటావా” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, యెహోవా “నీవు వెళ్లి ఫిలిష్తీయులను చంపి కెయీలాను కాపాడు” అని దావీదుతో చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”