Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 23:1 - పవిత్ర బైబిల్

1 అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నారనీ” చెప్పారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కళ్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళాల మీద ఉన్న ధాన్యం దోచుకొంటున్నారని దావీదుకు తెలిసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “చూడండి, ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిడి కళ్ళాలను దోచుకుంటున్నారు” అని దావీదుకు చెప్పినప్పుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “చూడండి, ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిడి కళ్ళాలను దోచుకుంటున్నారు” అని దావీదుకు చెప్పినప్పుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 23:1
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపోయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.


మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు.


నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగ పడతావు; కానీ నీకు నూనె రాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు.


“మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు మిమ్మల్ని చూచి, చెడుగా తిడతారు. విరుగగొట్టబడుతుంటారు.


మీరు నాశనం అయ్యేంతవరకు మీ పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను వారు తింటారు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం వారు విడిచిపెట్టరు. మీరు నాశనం అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉంటారు.


కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు.


ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా,


ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ