Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 21:13 - పవిత్ర బైబిల్

13 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపులమీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కార నిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 అందుకని దావీదు వారి ముందు తన ప్రవర్తన మార్చుకుని పిచ్చివాడిలా నటిస్తూ, గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మిని తన గడ్డంపైకి కారనిస్తూ ఉన్నాడు. వారు దావీదును పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి పనులు చేస్తూ వచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 21:13
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.


ఎవడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు. ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.


యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే. కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి? వాళ్లు కేవలం బ్రతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులు. వారు కూడా గడ్డిలాగే చస్తారు.”


“ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును.


గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.


ఆకీషు, “వీని వైపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ