1 సమూయేలు 2:8 - పవిత్ర బైబిల్8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు. యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే. భూమియొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు. အခန်းကိုကြည့်ပါ။ |
“కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమిమీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతలుగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!