కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.
ఇవి దావీదు చివరి మాటలు, “యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం. దావీదు ఇలా అన్నాడు:
దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి.
కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు అతనితో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు: “సౌలు వేల కొలదిగా హతము చేసాడు! దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!”
ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ ‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు, దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’ అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.