Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 18:22 - పవిత్ర బైబిల్

22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం. అతని అధికారులకు కూడా నీవంటే ఇష్టం. నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 తన సేవకులను పిలిపించి–మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి–రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 సౌలు తన సేవకులతో ఇలా ఆజ్ఞాపించాడు “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి, ‘రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది. రాజు సేవకులంతా నీపట్ల స్నేహంగా ఉన్నారు. కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 18:22
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.


ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు.


“మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.


సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుొటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ