1 సమూయేలు 10:5 - పవిత్ర బైబిల్5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |