1 కొరింథీ 4:7 - పవిత్ర బైబిల్7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల నుండి నీవు పొందనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు ఇతరుల నుండి పొంది కూడా పొందని వానిలా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల నుండి నీవు పొందనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు ఇతరుల నుండి పొంది కూడా పొందని వానిలా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము7 ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? నీవు పొందుకోనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు పొందివుంటే, పొందని వానిలాగా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? အခန်းကိုကြည့်ပါ။ |
అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.