Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 9:28 - పవిత్ర బైబిల్

28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినపుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొని పోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 9:28
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.


వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.


మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.


ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు.


“తర్వాత పవిత్ర స్థలంలో ఆరాధనకు ఉపయోగించే ప్రత్యేక వస్తువులన్నింటినీ సమకూర్చాలి. ఆ వస్తువులను ఒక్క చోట సమకూర్చి, నీలం బట్టతో వాటిని చుట్టి పెట్టాలి. అప్పుడు దాన్ని శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. వీటిని మోసేందుకు ఒక చట్రంమీద వాటిని ఉంచాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ