1 దిన 9:22 - పవిత్ర బైబిల్22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిచొప్పున సరిచూడ బడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు.
“ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు. సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).