21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు.
21 గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబదివేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.
21 కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
21 వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.
21 వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.
మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు.
యుద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.
ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.
వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.