1 దిన 26:32 - పవిత్ర బైబిల్32 యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 పరాక్రమశాలులగువాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయులమీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.) အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.) အခန်းကိုကြည့်ပါ။ |
“అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”