3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.”
3 అమ్మోనీయుల యధిపతులు హానూనుతో–నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపర చుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవిచేయగా
3 అమ్మోనీయుల అధిపతులు హానూనుతో “నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు” అని చెప్పారు.
3 అమ్మోనీయుల దళాధిపతులు హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? అతని దూతలు ఈ దేశాన్ని జయించడానికి గూఢాచారులుగా రాలేదా?” అన్నారు.
3 అమ్మోనీయుల దళాధిపతులు హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? అతని దూతలు ఈ దేశాన్ని జయించడానికి గూఢాచారులుగా రాలేదా?” అన్నారు.
కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలిసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.
ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది. ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకు వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే గడిపారు.
కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు.
అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు.