జెకర్యా 7:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు. ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు. దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు తమ చెవులు మూసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.
మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీయొద్దకు పంపుచు – ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనినయెడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండినయెడలను, నేను మీకును మీపితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి