తీతుకు 2:14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము14 యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.