5 ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
5 ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.

అందుకాయన–నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెనుగాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.
బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు చున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవాచేయు ప్రతి దండన తన మందిరమునుగూర్చి ఆయనచేయు ప్రతి దండన.
కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవభాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుము లును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.
మరియు సువర్ణధూపార్తి చేతపట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్య బడెను.