కీర్తన 7:9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం చేయుము. దేవా, నీవు మంచివాడవు, మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి. အခန်းကိုကြည့်ပါ။ |
సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.