Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 10:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది వారి నాలుకక్రింద చేటును పాపమును ఉన్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు. దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 10:7
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురువారి కడుపున కపటము పుట్టును.


చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.


అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.


పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురువారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)


నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడలవారి పెదవుల చేటు వారిని ముంచును గాక


నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.


వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.


వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు.


ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.


వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.


కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.


కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.


వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.


తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.


వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియువారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియువారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.


కోపముచేత వారిని నిర్మూలము చేయుమువారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము. (సెలా.)


అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకేవారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషమువారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)


ఒకడు కత్తికి పదును పెట్టునట్లువారు తమ నాలుక లకు పదును పెట్టుదురు.


పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్ధమును కనియున్నాడు.


ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.


అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.


వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.


నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.


విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడుచేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.


నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.


దేశమందు బీదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,


సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ