Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 10:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 జ్ఞానచిత్తుడు ఉపదేశము నంగీకరించును పనికిమాలిన వదరుబోతు నశించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 10:8
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును.


జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.


కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.


జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.


శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు


పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.


తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.


ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టిమాటలు లేమిడికి కారణములు.


తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.


అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.


జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.


జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మ్రింగివేయును.


మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ