Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 32:33 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషానురాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 కనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే వంశంలో సగంమంది ప్రజలకు ఆ ప్రదేశాన్ని మోషే ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీవాడగు సీహోను రాజ్యం, బాషాను రాజైన ఓగు రాజ్యం ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 32:33
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనేష్షయొక్క అర్ధగోత్రపువారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.


పరాక్రమశాలులగువాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయులమీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారిమీదను వారిని నియమించెను.


రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.


రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని


మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.


ఏలయనగా తమతమపితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమతమ స్వాస్థ్యముల నొందిరి.


మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రములవారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమతమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.


మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి.


ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోనుకొండవరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా


యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను.


మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు


ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి.


మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను ఇవతల వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను


కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ