సంఖ్యా 28:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 ప్రతినెల మొదటి రోజు యెహోవాకు దహన బలి అర్పించాలి. రెండు లేగదూడలు, ఒక పొట్టేలు, ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఏడు గొర్రెపిల్లలు అర్పించాలి. వాటిలో ప్రతి లేగ దూడతో အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలో లోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి. အခန်းကိုကြည့်ပါ။ |
నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలములయందును, విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.
సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.