సంఖ్యా 2:34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లువారు తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్34 కనుక మోషేతో యెహోవా చెప్పిన వాటన్నింటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. యెహోవా వారితో చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు వారివారి పతాకాలదగ్గర నివాసం చేసారు. యెహోవా వారితో చెప్పిన విధానంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంతో, వంశంతోనే ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |