Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 16:2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఈ నలుగురు ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 16:2
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.


తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రా యిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.


వారి పితరులయిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమపితరులయిండ్లకు పెద్దలైరి.


నేను నీ కను గ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణముకాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశం సించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.


వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.


వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.


మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.


మరియు యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను.


కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.


అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదుగాని తన పాపమునుబట్టి మృతిబొందెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ