Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 9:25 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవతోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగునవారుతిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అప్పుడు వారు సరిహద్దు గోడలున్న పట్టణాలను, ఫలించే భూములను స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్న ఇళ్ళను, తవ్వి ఉన్న బావులను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను, ఎంతో విస్తారంగా ఫలించే చెట్లను వశపరచుకున్నారు. ఆ విధంగా వారు తిని, తృప్తి పొందారు. నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మంచి చెడ్డలు మరచిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు. సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు. మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ, అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి. వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి. వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు. వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 9:25
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోతవిగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు.


ఎనిమిదవదినమున అతడు జనులకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమతమ గుడారములకు వెళ్లిపోయిరి.


వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.


వారు తన కట్టడలను గైకొనునట్లును


సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.


ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి –యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.


వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.


యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను.


దాని ఫలములను శ్రేష్ఠపదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి.


క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.


వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవాజ్ఞాపించినవాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నావు.


వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.


అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులుగాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును


తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.


తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందువారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.


లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?


ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియుగాక ప్రాకారములేని పురములనేకములను పట్టు కొంటిమి.


భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను పొలముల పంట వానికి తినిపించెను కొండబండనుండి తేనెను చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.


ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.


యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ