Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 3:25 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహా గోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజు పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 3:25
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,


మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.


అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును


అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.


వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో రంగువేయుచు నున్నాడే;


ఆ కాలమున బబులోనురాజు దండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా – యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును,


మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంక ఉంచబడియుండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను


కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహ శాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.


యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.


కల్దీయులు రాజనగరును ప్రజలయిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.


మందలగోపురమా, సీయోను కుమార్తె పర్వతమా,మునుపటిలాగున యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వము కలుగును;


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ