Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 13:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆ సమయంలో నేను యెరూషలేంలో లేను. ఎందుకంటే, బబులోను దేశపు రాజు అర్తహషస్త పాలన 32 వ సంవత్సరంలో రాజును దర్శించి, కొన్ని రోజులైన తరువాత రాజు దగ్గర అనుమతి తీసుకుని యెరూషలేంకు తిరిగి వచ్చాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజును కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజును యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 13:6
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.


అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.


మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.


మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చి –లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.


మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ