Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 13:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 లేవీయులకు అందాల్సిన వంతులు వాళ్లకు అందకపోవడం వలన ఆలయంలో పరిచర్య చేసే లేవీయులు, గాయకులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని తెలుసుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ స్వంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 13:10
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

మరియు యెహోవా ధర్మశాస్త్రమునుబట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.


ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.


ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.


జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.


దహనబలులుగా గొఱ్ఱెమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.


మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవభాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.


–ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.


నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ