Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 11:17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతనిచేతిక్రింది వారు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 మత్తన్యా (మత్తన్యా మీకా కొడుకు, మీకా జబ్ది కొడుకు, జబ్ది ఆసాఫు కొడుకు. ఆసాఫు దైవ స్తోత్రాలు, ప్రార్థన గేయాలు పాడటంలో గాయకులకి నాయకత్వం వహించేవాడు), బక్బుక్యా (తన సోదరులపై అజమాయిషీలో బక్బుక్యాది రెండవ స్థానం), షమ్మూయ కొడుకు అబ్దా, (షమ్మూయ గాలాలు కొడుకు, గాలాలు యెదూతూను కొడుకు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 11:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్నవారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.


మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవచేయుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.


యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.


బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,


జక్కూరు షేరేబ్యా షెబన్యా


లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.


పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.


లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదుయొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.


మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి.


అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.


పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.


దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ