Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మార్కు 13:7 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములనుగూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి విన్నప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం రావలసి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి విన్నప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం రావలసి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

7 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వినినప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం రావలసి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మార్కు 13:7
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.


వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగానుండును వాడు దుర్వార్తకు జడియడు.


నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.


ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు


–ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడివారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.


ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.


అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ


హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.


అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.


జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకు ప్రారంభము.


మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.


శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ