Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 1:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరువగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకు మీరు దుఃఖిస్తారు. రాబందుల్లాగా మీ తలలు బోడి చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 మీకు ఇష్టమైన పిల్లల కోసం శోకంలో మీ తలలు గొరిగించుకోండి; రాబందులా బోడితల చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 మీకు ఇష్టమైన పిల్లల కోసం శోకంలో మీ తలలు గొరిగించుకోండి; రాబందులా బోడితల చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 1:16
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.


అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను


ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది


ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా


ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.


ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి; రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మనమీదికి రాకుండ మానిపోలేదు;


గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు?


నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.


తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.


నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు


యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.


యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.


మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును.


కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ