మలాకీ 2:16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే క్రూరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి. အခန်းကိုကြည့်ပါ။ |