లేవీయకాండము 8:23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 అప్పుడు మోషే ఈ పోట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి బొటన వేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద వేసాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమునుగూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధపరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమునుగూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.