Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 5:6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱెపిల్లనేగాని ఆడు మేకపిల్లనేగాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 తాను చేసిన అపరాధం కోసం బలి అర్పణను యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. దానికోసం తన మందలోనుండి ఆడమేకనైనా, ఆడగొర్రెనైనా పాపం కోసం బలిగా అర్పించాలి. అతని పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ పరిహారార్థబలిని యెహోవాకు అర్పించాలి. గొర్రెల మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థబలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజకుడు చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 5:6
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థబలిపశువులును అపరాధపరిహారార్థబలిపశువులును వధింపబడును.


అప్పుడాయన నాతో ఇట్లనెను – విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థబలిపశు మాంసమును అపరాధపరిహారార్థబలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.


పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.


అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వారికి క్షమాపణ కలుగును.


తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడినయెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి


మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొనివచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి


మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను.


మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ