Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 4:26 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 సమాధానబలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలిపీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితంచేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 అతడు సమాధాన బలిపశువు క్రొవ్వును కాల్చినట్టే దీని క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు ఆ నాయకుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతడు క్షమించబడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 అతడు సమాధాన బలిపశువు క్రొవ్వును కాల్చినట్టే దీని క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు ఆ నాయకుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతడు క్షమించబడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 4:26
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థబలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.


రెండవదినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేత బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను.


అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.


ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమెకు పవిత్రత కలుగును.


అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.


యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.


రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.


అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.


అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.


మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠముమీద దహింపవలెను.


అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా వారికి క్షమాపణ కలుగును.


మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసినవాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును.


పరిశుద్ధమైనదాని విషయములో తాను చేసిన పాపమువలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవవంతు యాజకునికియ్యవలెను. ఆయాజకుడు అపరాధపరిహారార్థబలియగు పొట్టేలువలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతనికి క్షమాపణ కలుగును.


ఆయాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.


యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.


పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపముచేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలనవాడు క్షమాపణ నొందును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ