Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 22:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 నా పవిత్ర నామానికి గౌరవం చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. నేను, యెహోవాను, మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 22:32
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధపరచు కొనును.


సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.


అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను–ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;


నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.


మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను


యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.


అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను.


నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము.


–ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లువారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.


మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.


నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.


కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, –పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక,


అందు కాయన–మీరు ప్రార్థన చేయునప్పుడు–తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,


సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.


కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ