Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 22:21 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతి బలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేదీ ఉండకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 “ఒక వ్యక్తి సమాధాన బలి యెహోవాకు తీసుకొని రావచ్చును. ఆ సమాధాన బలి ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపు కావచ్చును. లేక అది ఆ వ్యక్తి యెహోవాకు అర్పించాలనుకొన్న ఒక ప్రత్యేక కానుక కావచ్చును. అది ఇక కోడెదూడ కావచ్చును లేక గొర్రె కావచ్చును. కానీ అది ఆరోగ్యంగా ఉండాలి. ఆ జంతువులో ఏ దోషమూ ఉండకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ప్రత్యేక మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ కోసం ఎవరైనా పశువుల మందలో నుండి గాని లేదా గొర్రెల మందలో నుండి గాని యెహోవాకు సమాధానబలి తెస్తే, అది అంగీకరించబడేలా ఏ లోపం లేనిదై ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ప్రత్యేక మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ కోసం ఎవరైనా పశువుల మందలో నుండి గాని లేదా గొర్రెల మందలో నుండి గాని యెహోవాకు సమాధానబలి తెస్తే, అది అంగీకరించబడేలా ఏ లోపం లేనిదై ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 22:21
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును.


దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.


మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.


–సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను


గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగముగలదేమి చిరుగుడుగలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠముమీద యెహోవాకు హోమము చేయకూడదు.


అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.


యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱె మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను.


యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల


మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ