Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 18:19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 అపవిత్రతవలన స్త్రీ కడగాఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 “మరియు ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావం అవుతున్నప్పుడు, లైంగిక సంబంధాలకోసం నీవు ఆమె చెంతకు పోకూడదు. ఈ సమయంలో ఆమె అపవిత్రంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 “ ‘స్త్రీ నెలసరి ద్వార అపవిత్రంగా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ఆమె దగ్గరకు వెళ్లవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 “ ‘స్త్రీ నెలసరి ద్వార అపవిత్రంగా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ఆమె దగ్గరకు వెళ్లవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 18:19
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.


పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,


తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టయైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.


–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమె యేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండవలెను.


స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.


ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల,వాడు ఏడు దినములు అపవిత్రుడగును;వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.


నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.


కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ