Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 14:8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాతవాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అప్పుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తన జుట్టు కత్తెర వేసుకోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. తరువాత అతడు శిబిరంలోకి వచ్చి తన గుడారం బయట ఏడు రోజులు ఉండిపోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 “తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షౌరం చేసుకోవాలి. అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్లవచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారంబయట ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 14:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియైయుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.


యెహోవా మోషేతో–నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని


అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి.


వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.


యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగావాడు పవిత్రుడగును.


ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.


స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.


అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.


ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవదినమున తనతల గొరిగించుకొనవలెను.


వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని


నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని


దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.


అందుకు నేను–అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను–వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని వాటిని తెలుపుచేసికొనిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ