Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 11:32 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

32 వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

32 అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

32 అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 11:32
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.


మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.


స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.


యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.


విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.


మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమివాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.


అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొనువరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.


దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడిపాత్రలో వండినయెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను.


మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.


అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.


ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.


మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ