Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 10:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యెహోవా మోషే ద్వార ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని మీరు వారికి బోధించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యెహోవా మోషే ద్వార ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని మీరు వారికి బోధించాలి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 10:11
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును.


వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.


యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమపితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.


యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి


ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.


అప్పుడు జనులు–యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.


యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్‍ప్రయోజనమైనవాటిని అనుసరింతురు


యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాదూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.


నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.


దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.


యెహోవా ఏర్పరచు కొను స్థలమునవారు నీకు తెలుపు తీర్పుచొప్పున నీవు జరి గించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పుతీర్చుటకు జాగ్రత్తపడవలెను.


వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పుచొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటనుండి కుడికిగాని యెడమకుగాని నీవు తిరుగకూడదు.


కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.


వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు


కాగా మీ రేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ