Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 2:3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగ మును ఆయన విరుగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి యున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 తీవ్రమైన కోపంతో ఆయన ఇశ్రాయేలు ప్రజల బలాన్ని అణచివేశాడు. శత్రువుల ముందు ఆయన తన కుడి చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. చుట్టూ ఉన్న వాటన్నిటినీ కాల్చే రగులుతున్న అగ్నిజ్వాలలు కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఆయన తన కోపాగ్నిలో ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఆయన తన కోపాగ్నిలో ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 2:3
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.


నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.


అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.


నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము.


భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.


–కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపెట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.


యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?


నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.


యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యముదాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?


బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలెనుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.


కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.


మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.


అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.


మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.


అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నాకోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.


పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.


యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను.


ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నాకోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,


వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.


ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.


ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైననులేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.


ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను.


నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవులబెట్టును.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ