Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 దాని కాపురస్థులందరు నిట్టూర్పు విడుచుచు ఆహా రము వెదకుదురు తమ ప్రాణసంరక్షణకొరకు తమ మనోహరమైన వస్తువుల నిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని దృష్టించి చూడుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 దాని కాపురస్థులందరూ మూలుగుతూ ఆహారం కోసం వెదుకుతున్నారు. తమ ప్రాణం నిలుపుకోవడం కోసం తమ శ్రేష్ఠమైన వస్తువులు ఇచ్చి ఆహారం కొన్నారు. యెహోవా, నన్ను చూడు. నేను విలువ లేని దానిగా అయ్యాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు! ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఆమె ప్రజలందరూ ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు; తాము బ్రతికి ఉండడానికి వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు. “యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు, ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఆమె ప్రజలందరూ ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు; తాము బ్రతికి ఉండడానికి వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు. “యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు, ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.


చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.


మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.


కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు


వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడినిబట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.


రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.


నాల్గవ నెల తొమ్మిదవదినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను.


యెరూషలేము ఘోరమైన పాపముచేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని ఘనపరచిన వారందరు దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది


దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగినశ్రమను దృష్టించుము.


నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.


గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని–అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె దరు.


నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగునా?


యెహోవా, మాకు కలిగినశ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ