Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 దాని మనోహరమైన వస్తువులన్నియు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజములో ప్రవేశింపకూడదని యెవరినిగూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనములవారు దాని పరిశుద్ధస్థలమున ప్రవేశించి యుండుట అది చూచుచునేయున్నది

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 శత్రువు తన చేతిని చాచాడు. అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమె చూసింది. ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:10
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.


ఆ దినమందువారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో–అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.


నీ పరిశుద్ధజనులు స్వల్పకాలమే దేశమును అనుభ వించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు.


నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరుచేయు సమస్త పాపములనుబట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.


ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.


బబులోను రాజైన నెబుకద్రె జరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానుల నందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు


యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు ననే సెలవిచ్చుచున్నాడు


ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములోనుండి తప్పించుకొని వచ్చుచున్నవారి శబ్దము వినబడుచున్నది మన దేవుడగు యెహోవాచేయు ప్రతికార సమా చారమును తన ఆలయము విషయమై ఆయనచేయు ప్రతికార సమాచారమును సీయోనులో ప్రకటించుడి.వారు వచ్చుచున్నారు.


మేము దూషణవాక్యము విని సిగ్గుపడియున్నాము అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధస్థలములలోనికి వచ్చియున్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి


అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను. మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి


యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు నంతటిని జ్ఞాపకము చేసికొనుచున్నది దానికి కలిగినశ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరును లేక దాని జనము శత్రువుచేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతిదినములనుబట్టి దాని నపహాస్యము చేసిరి.


ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి.


వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్ర పరచుదురు.


ఆయన–మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోనివారిని హతము చేయసాగిరి.


మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు – చదువు వాడు గ్రహించుగాక – యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;


అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.


ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ