యెహోషువ 9:24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అందుకు వారు యెహోషువను చూచి–నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితిమి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 గిబియోనీ ప్రజలు ఇలా జవాబు చెప్పారు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము. အခန်းကိုကြည့်ပါ။ |